కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో సమీకృత మార్కెట్ భవనం నిర్మించేందుకు నీటిపారుదల, అటవీ శాఖ కార్యాలయాల స్థలాలను జిల్లా పాలనాధికారి శరత్, అదనపు కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే పరిశీలించారు. జిల్లాలోని ప్రతి డివిజన్లో ఎకరా స్థలంలో మార్కెట్ భవనాలు నిర్మిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
మార్కెట్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్ - ఎల్లారెడ్డిలో మార్కెట్ స్థల పరిశీలన
మార్కెట్ నిర్మించేందుకు అవసరమైన స్థలాన్ని కామారెడ్డి జిల్లా పాలనాధికారి శరత్, అదనపు కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే పరిశీలించారు. ఎల్లారెడ్డి డివిజన్లోని నీటిపారుదల, అటవీశాఖల కార్యాలయాల స్థలాలపై ఆరా తీశారు. ఎకరా స్థలంలో అన్ని ఒకేచోట దొరికేలా మార్కెట్ నిర్మిస్తామని వెల్లడించారు.
మార్కెట్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్
ప్రజలకు ఒకే చోట శాఖాహారం, మాంసాహారం దొరికేలా సమీకృత మార్కెట్లు ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. అవసరమైన స్థలాన్ని గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ సత్యనారాయణ, తహసీల్దార్ స్వామి, పురపాలక ఇంఛార్జ్ కమిషనర్ జీవన్ పాల్గొన్నారు