రైస్ మిల్లులు నుంచి తీసుకొచ్చిన బియ్యంలో పురుగులు ఉండడం పట్ల గిడ్డంగుల అధికారులపై కామారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద ఉన్న గిడ్డంగులను ఆయన తనిఖీ చేశారు.
గిడ్డంగులను తనిఖీ చేసిన కలెక్టర్ శరత్
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద ఉన్న గిడ్డంగులను జిల్లా కలెక్టర్ శరత్ తనిఖీ చేశారు. నాణ్యతలేని గన్ని సంచుల విషయంలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
గిడ్డంగులను తనిఖీ చేసిన కలెక్టర్ శరత్
రైస్ మిల్లుల వద్ద గన్ని సంచుల్లో బియ్యాన్ని నింపేముందు.. సంచులను ప్యుమిగేషన్ చేయడం లేదని.. అందుకే పురుగులు సంచుల్లో బియ్యాన్ని నష్ట పరుస్తాయని చెప్పారు. నాణ్యతలేని గన్ని సంచుల ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, గిడ్డంగుల శాఖ అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:నేడు తెరాస రాష్ట్ర కార్యవర్గ సమావేశం... 'సీఎంగా కేటీఆర్'పై స్పష్టత!