తెలంగాణ

telangana

ETV Bharat / state

CM KCR Speech at Jukkal Praja Asheerwada Sabha : కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే.. కరెంట్‌ ఉండదు, రైతుబంధు అందదు : కేసీఆర్ - కామారెడ్డి జిల్లాలో సీఎం కేసీఆర్ స్పీచ్

CM KCR Speech at Jukkal Praja Asheerwada Sabha : బీఆర్​ఎస్​ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చిందని బీఆర్​ఎస్​ అధినేత, సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తలసరి ఆదాయం, విద్యుత్​ వినియోగంలో దేశంలోనే మన రాష్ట్రం నంబర్‌వన్‌గా ఉందని తెలిపారు. ఈ క్రమంలోనే రైతుబంధు పేరుతో ప్రజల డబ్బు వృథా చేస్తున్నానని విపక్ష నేతలు అంటున్నారన్న కేసీఆర్.. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే.. కరెంట్‌ ఉండదు, రైతుబంధు అందదని వ్యాఖ్యానించారు.

brs campaign in kamareddy
CM KCR Speech at Jukkal Praja Asheerwada Sabha

By ETV Bharat Telangana Team

Published : Oct 30, 2023, 3:00 PM IST

Updated : Oct 30, 2023, 4:02 PM IST

CM KCR Speech at Jukkal Praja Asheerwada Sabha కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే కరెంట్‌ ఉండదు రైతుబంధు అందదు కేసీఆర్

CM KCR Speech at Jukkal Praja Asheerwada Sabha : ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్న బీఆర్​ఎస్​ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్​.. నేడు కామారెడ్డి జిల్లా జుక్కల్​లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్​ ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. కొత్తగా ఏర్పాటైన రాష్ట్రంలో ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ వస్తున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఇవ్వకుండా ఆలస్యం చేసిందని ఆరోపించారు. తాను ఆమరణ నిరాహార దీక్షకు దిగిన తర్వాతే.. కాంగ్రెస్‌ ప్రభుత్వం దిగి వచ్చిందని గుర్తు చేశారు.

CM KCR Speech in BRS Public Meeting at Aleru : కాంగ్రెస్​ హయాంలో టపాసులు మాదిరి ట్రాన్స్​ఫార్మర్లు పేలుతుండేవి : సీఎం కేసీఆర్​

ఈ క్రమంలోనే రాష్ట్రం ఏర్పడక ముందు గ్రామాల్లో మంచి నీటికి ఎంతో సమస్య ఉండేదని కేసీఆర్‌ పేర్కొన్నారు. ఇప్పుడు ప్రతి ఇంటికీ నల్లా ద్వారా మంచి నీరు అందిస్తున్నామని తెలిపారు. పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలో పరిస్థితులు ఎలా ఉన్నాయో గమనించాలని.. మహారాష్ట్రలో ఇప్పటికీ రోజుకు 8 మంది వరకు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని చెప్పారు. తెలంగాణలో తప్ప.. దేశంలో ఏ రాష్ట్రంలోనూ 24 గంటల కరెంట్ లేదని వెల్లడించారు. రైతుబంధు పేరుతో ప్రజల డబ్బు వృథా చేస్తున్నానని విపక్ష నేతలు అంటున్నారని మండిపడ్డారు. రెండు దఫాల్లో రూ.37 వేల కోట్లు రుణమాఫీ చేసుకున్నామన్నారు.

CM KCR Speech at Paleru Meeting : కాంగ్రెస్ అధికారంలోకి​ వస్తే రైతుబంధుకు రాంరాం.. దళితబంధుకు జైభీమ్‌ అంటారు : సీఎం కేసీఆర్

పదేళ్ల క్రితం గ్రామాల్లో మంచినీటికి ఎంతో సమస్య ఉండేది. ఇప్పుడు ప్రతి ఇంటికి నల్లా ద్వారా మంచి నీరు ఇస్తున్నాం. పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట్రల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రజలు గమనించాలి. మహారాష్ట్రలో ఇప్పటికీ రోజుకు 8 మంది వరకు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. తెలంగాణలో తప్ప.. దేశంలో ఏ రాష్ట్రంలోనూ 24 గంటల కరెంట్ లేదు. - కేసీఆర్, బీఆర్​ఎస్​ అధినేత, ముఖ్యమంత్రి

CM KCR Election Campaign at Thungathurthy : గులాబీ జెండా రాకముందు తెలంగాణ గురించి మాట్లాడితే.. నక్సలైట్లు అనేవారు : కేసీఆర్​

బీఆర్​ఎస్​ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చిందని కేసీఆర్ వెల్లడించారు. ఎస్సీలను బాగు పరిచేందుకే దళితబంధు తీసుకొచ్చామన్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్న ఆయన.. తలసరి విద్యుత్‌ వినియోగంలో తెలంగాణ రాష్ట్రం నంబర్‌వన్‌గా ఉందన్నారు. కాంగ్రెస్‌ వస్తే.. కరెంట్‌ ఉండదు, రైతు బంధు ఉండదని హెచ్చరించారు.

BRS Praja Ashirvada Sabha at Kodad : తెలంగాణ హక్కులను కాపాడేది గులాబీ పార్టీనే : కేసీఆర్​

బీఆర్​ఎస్​ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చింది. ఎస్సీలను బాగుపరిచేందుకే దళితబంధు తీసుకువచ్చాం. తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. తలసరి విద్యుత్‌ వినియోగంలో మన రాష్ట్రమే నంబర్‌వన్‌. రైతుబంధు పేరుతో ప్రజల డబ్బు వృథా చేస్తున్నానని విపక్ష నేతలు అంటున్నారు. కాంగ్రెస్‌ వస్తే.. కరెంట్‌ ఉండదు, రైతు బంధు ఉండదు. - సీఎం కేసీఆర్‌

తెలంగాణ పోలింగ్ @30 డేస్.. 'అభివృద్ధి' మంత్రంతో బీఆర్ఎస్ .. 'బీసీతంత్రం'తో బీజేపీ .. 'ఆరింటి'పైనే ఆశలతో కాంగ్రెస్

Last Updated : Oct 30, 2023, 4:02 PM IST

ABOUT THE AUTHOR

...view details