కామారెడ్డి (Kamareddy)జిల్లాకు వచ్చే సంవత్సరం వైద్య కళాశాల వస్తుందని సీఎం కేసీఆర్ (Cm Kcr) హామీ ఇచ్చారు. కామారెడ్డి మున్సిపాలిటీకి వెంటనే రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. బాన్సువాడ, ఎల్లారెడ్డికి రూ.25 కోట్ల చొప్పున మంజూరు చేస్తామన్నారు.
Cm Kcr: కామారెడ్డికి మెడికల్ కాలేజీ... నాదీ పూచీ - Medical college for kamareddy
జిల్లాల పర్యటనలో భాగంగా కామారెడ్డి జిల్లాలో పర్యటించారు ముఖ్యమంత్రి కేసీఆర్. జిల్లాపై సీఎం వరాలు జల్లు కురిపించారు. జిల్లాకు మెడికల్ కళాశాలతో పాటు మున్సిపాలిటీలకు, గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్
కామారెడ్డికి ట్రాఫిక్ పోలీస్స్టేషన్ మంజూరు చేస్తామని సీఎం కేసీఆర్ (Cm Kcr) అన్నారు. జిల్లాలో 525 గ్రామ పంచాయతీలకు తలో రూ.10 లక్షలు మంజూరుతో పాటు బంజేపల్లి, గజ్యానాయక్ తాండలకు 33/11 కేవీ సబ్ స్టేషన్ మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
ఇదీ చూడండి: CM TOUR: కామారెడ్డిలో సీఎం పర్యటన... నూతన కలెక్టరేట్ ప్రారంభం
Last Updated : Jun 20, 2021, 8:33 PM IST