తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రేమికుల బలవన్మరణం.. ఇరు వర్గాల మధ్య ఘర్షణ - Kamareddy district latest news

కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఇసాయిపేట్​లో ఇరువర్గాల మధ్య ఘర్షణలో చాలామందికి తీవ్ర గాయాలైన ఘటన... ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇద్దరు ప్రేమికుల బలవన్మరణానికి సంబంధించి ఇరు కుటుంబీకులు దాడి చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గొడవకు కారణమైన పదిమందిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు.

Clashes between two communities
ఇసాయిపేట్​లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ, కామారెడ్డి జిల్లా తాాజ వార్తలు

By

Published : May 4, 2021, 5:34 PM IST

కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఇసాయిపేట్ గ్రామానికి చెందిన మహేశ్వరి, నితీశ్​లు కొంతకాలంగా ప్రేమించుకున్నారు. వారి ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలియడంతో అమ్మాయిని వారి తల్లిదండ్రులు మందలించారు. సదరు వ్యక్తులు అబ్బాయిని కూడా మందలించడంతో ఆమెను పెళ్లి చేసుకోనని తెలిపాడు. దాంతో మనస్తాపానికి గురైన మహేశ్వరి ఏప్రిల్ 21 ఉరి వేసుకుని మరణించింది. అనంతరం నితీశ్​ కూడా భయంతో ఏప్రిల్ 25 న బలవన్మరణానికి పాల్పడ్డాడు.

కోపాద్రుక్తులైన నితీశ్​ కుటుంబ సభ్యులు మహేశ్వరి ఇంటిపై ఏప్రిల్ 29న దాడి చేశారు. వారి మృతికి కారణం మీరు అంటే... మీరే అంటూ ఇరు వర్గాల వారు దాడి చేసుకున్నారు. దాడిలో చాలామందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక పోలీసులు అక్కడికి చేరుకుని గొడవకు కారణమైన పదిమందిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై పోలీసులను వివరణ కోరగా గ్రామస్థుల సమక్షంలో మాట్లాడుకుంటామని తెలపడంతో వారిపై కేసు నమోదు చేయలేదని తెలిపారు.

ఇదీ చదవండి: జమున హేచరీస్‌పై బలవంతపు చర్యలు తీసుకోవద్దు: హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details