తెలంగాణ

telangana

ETV Bharat / state

మద్యం మత్తులో గొడవ.. ఇరువర్గాల ఘర్షణ - kamareddy district crime news

మద్యం మత్తులో జరిగిన చిన్న గొడవ ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. గ్రామ సర్పంచ్ భర్తను అరెస్టు చేశారు.

clash between two factions
ఇరువర్గాల ఘర్షణ

By

Published : Apr 2, 2021, 9:08 AM IST

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని గున్కూల్​లో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. మద్యం మత్తులో జరిగిన చిన్న గొడవ ఈ ఘర్షణకు దారితీసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. గ్రామ సర్పంచ్ భర్తను అరెస్టు చేశారు.

ఈ అరెస్టుకు నిరసనగా నిజాంసాగర్​ పోలీస్​ స్టేషన్​ ఎదుట గ్రామస్థులు ఆందోళనకు దిగారు. తెరాసకు చెందిన ఓ జిల్లా ప్రజాప్రతినిధి చెప్పే మాటలు విని.. సర్పంచ్ భర్తను అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. చివరకు పోలీసులు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.

ఇదీ చూడండి: ఉస్మానియా ఆస్పత్రిలో బిడ్డను వదిలేసి వెళ్లిన తల్లి

ABOUT THE AUTHOR

...view details