కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలోని వైద్యుల నిర్లక్ష్యం వల్లే శిశువు మృతి చెందాడని బాధితులు ఆందోళనకు దిగారు. కామారెడ్డి గొల్లవాడకు చెందిన ఆకృతికి నొప్పులు రావడం వల్ల గత మూడు రోజుల నుంచి ప్రభుత్వ ఆస్పత్రి చుట్టూ తిరిగారు. అయినా దవాఖానా సిబ్బంది పట్టించుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. నిన్న మధ్యాహ్నం అడ్మిట్ చేసుకున్నారని తెలిపారు. రాత్రి నొప్పులు బాగా రావడం.. డాక్టర్ అందుబాటులో లేకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని వాపోయారు.
ఈరోజు ఉదయం ఆమెకు సర్జరీ చేయడం వల్ల కడుపులోనే శిశువు మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. ఇదిలా ఉండగా ఆస్పత్రి వైద్యులు మాత్రం గత నెల 9వ తేదీనే 9 నెలలు పూర్తయ్యాయని.. మళ్లీ 9వ తేదీ వస్తే 10 నెలలు నిండుతాయని ఇంకా16వ తేదీ వరకు సమయం ఉందంటూ నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెప్పుకొచ్చారు.
వైద్యుల నిర్లక్ష్యం.. కడుపులోని శిశువు మృతి - శిశువు మృతి
కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్ల కడుపులోని శిశువు కడుపులోనే మరణించాడని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.
![వైద్యుల నిర్లక్ష్యం.. కడుపులోని శిశువు మృతి child-dead-victims-protest-in-front-of-hospital-in-kamareddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5278421-1-5278421-1575545615724.jpg)
వైద్యుల నిర్లక్ష్యం.. కడుపులోని శిశువు మృతి
వైద్యుల నిర్లక్ష్యం.. కడుపులోని శిశువు మృతి
ఇదీ చూడండి: దిశ సెల్‌ఫోన్‌ను గుర్తించిన పోలీసులు