తెలంగాణ

telangana

ETV Bharat / state

చెంచు తెగ పిల్లల సైకిల్​ యాత్ర.. మొత్తం 10,000 కి.మీ. - తెలంగాణ వార్తలు

చెంచు తెగకు చెందిన 21 మంది పిల్లలు ఆంధ్రప్రదేశ్​లోని ప్రకాశం జిల్లా ఎర్రగొండ్లపాలెం నుంచి హిమాలయాల వరకు విజ్ఞాన యాత్ర చేపట్టారు. కామారెడ్డి జిల్లా బిక్కనూర్​ మండలం జంగంపల్లి శివారులో వీరు కాసేపు విశ్రాంతి తీసుకుని మళ్లీ యాత్రను కొనసాగించారు. నాగరికతకు దూరంగా మగ్గుతున్న వీరిని సన్మార్గం వైపు మళ్లిస్తామని మార్గనిర్దేశకుడు కాళిదాసు వంశీధర్ పేర్కొన్నారు.

chenchu-tribe-childrens-cycle-ride-starts-from-erragonda-palem-to-himalayas-total-10000-km
చెంచు తెగ పిల్లల సైకిల్​ యాత్ర.. మొత్తం 10,000 కి.మీ.

By

Published : Feb 22, 2021, 9:19 AM IST

విజ్ఞాన యాత్రలో భాగంగా చెంచు తెగకు చెందిన 21 మంది 10 నుంచి 15 సంవత్సరాల లోపు పిల్లలు సైకిల్​ యాత్రను ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్​లోని ప్రకాశం జిల్లా ఎర్రగొండ్లపాలెం(నల్లమల అటవీ ప్రాంతం) నుంచి హిమాలయాల వరకు యాత్ర కొనసాగుతుందని వారి మార్గనిర్దేశకుడు కాళిదాసు వంశీధర్ అన్నారు. కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామ శివారులో కాసేపు సేద తీరి మళ్లీ యాత్రను కొనసాగించారు.

నాగరికతకు దూరంగా మగ్గుతూ.. చెడు వ్యసనాలకు బానిసలుగా మారిన వీరిని నాగరికత వైపు మళ్లించడం కోసమే భారతదేశ యాత్ర చేపట్టామని ఆయన తెలిపారు. వీరిని సన్మార్గంలో నడిపేందుకు కృషి చేస్తున్నామన్నారు. మొత్తం 10,000 కి.మీ. వరకు పిల్లలు సైకిల్​పై యాత్ర చేస్తారని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: ఈనెల 23 నుంచి జేఈఈ మెయిన్‌ తొలి విడత పరీక్షలు

ABOUT THE AUTHOR

...view details