తెలంగాణ

telangana

ETV Bharat / state

రసాయనాల పిచికారీ యంత్రం బహూకరణ - Pocharam Charitable Trust

కరోనా నివారణ కోసం రసాయనాల పిచికారీ యంత్రాన్ని బాన్సువాడ మున్సిపాలిటీకి పోచారం ఛారిటబుల్‌ ట్రస్ట్‌ అందించింది. మున్సిపల్‌ ఛైర్మన్‌ జంగం గంగాధర్‌ దీనిని స్వీకరించారు.

రసాయనాల పిచికారీ యంత్రం బహూకరణ
రసాయనాల పిచికారీ యంత్రం బహూకరణ

By

Published : Apr 18, 2020, 9:13 PM IST

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపాలిటీకి పోచారం ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో కరోనా నివారణ రసాయన ద్రావణ పిచికారీ యంత్రాన్ని బహూకరించారు. ట్రస్ట్‌ నిర్వాహకులు పోచారం సురేందర్ రెడ్డి స్థానిక మున్సిపల్ ఛైర్మన్ జంగం గంగాధర్‌కి దీనిని అందజేశారు. ఈ యంత్రం విలువ రూ. 3.10 లక్షలు ఉంటుందని వారు తెలిపారు. 200 లీటర్ల కెపాసిటీ ట్యాంక్‌ను కలిగి 180 డిగ్రీల కోణంలో తిరుగుతూ 30 అడుగుల వరకు ద్రావణాన్ని పిచికారీ చేయగలదని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details