కామారెడ్డి జిల్లాలో పులుల సంచారం కలకలం రేపుతోంది. వారం రోజుల క్రితం సదాశివనగర్ మండలం తుక్కోజీవాడి, తిమ్మాజీవాడి, భూంపల్లి గ్రామాల శివారులో చిరుత సంచరించింది. ఆదివారం సాయంత్రం అదే మండలంలోని లింగంపల్లి చెరువు కట్ట సమీపంలో చిరుత కనిపించిందని స్థానికులు తెలిపారు.
కామారెడ్డిలో చిరుత సంచారం... స్థానికుల కలవరం
కామారెడ్డి జిల్లోలో పులుల సంచారం ప్రజలను కలవర పెడుతోంది. వారం క్రితం సదాశివనగర్ మండలంలో చిరుత కనిపించగా... తాజాగా అదే మండలంలో చిరుత సంచరించిందని స్థానికులు తెలిపారు.
కామారెడ్డిలో చిరుత సంచారం... స్థానికుల కలవరం
వ్యవసాయ పనులు ముగించుకుని ఎడ్లబండిపై వెళ్తుండగా... బండి వెనకాలే చిరుత వచ్చిందని రైతులు పేర్కొన్నారు. రైతులు కేకలు వేయడంతో అక్కడే నిలిచిపోయిందని గ్రామస్థులు తెలిపారు. అటవీశాఖకు సమాచారం ఇవ్వగా... రాత్రి ఒంటిగంట వరకు గాలింపు చర్యలు చేపట్టామని అటవీ అధికారులు తెలిపారు. చిరుత కనిపించకపోవడంతో బోను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి:ప్రాణాలకు తెగించి.. వెలుగులు నింపాడు...