బాన్సువాడ కల్కి చెరువును మినీ ట్యాంక్ బండ్‌గా తీర్చిదిద్దామని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా 20 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన బోటును ప్రారంభించిన ఆయన.. పట్టణ ప్రజల సౌకర్యం కొసం ఈ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు.
పర్యాటక కేంద్రంగా ..
భవిష్యత్తులో మినీ ట్యాంక్ బండ్ వద్ద పార్కును ఏర్పాటు చేసి పర్యాటక కేంద్రంగా అభివృద్ధిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ మున్సిపల్ ఛైర్మన్ జంగం గంగాధర్ డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి , జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అంజిరెడ్డి, బాన్సువాడ నియోజకవర్గ తెరాస ఇన్ ఛార్జ్ పోచారం సురేందర్ రెడ్డి , అధికారులు , ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.