కామారెడ్డి జిల్లాలోని భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డి గ్రామంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్వేత ఆధ్వర్యంలో ఉదయం 5 గంటల నుంచే తనిఖీలు ప్రారంభించారు. సరైన ధృవ పత్రాలు లేని 80 ద్విచక్ర వాహనాలు 18 ఆటోలకు అపరాధ రుసుము విధించారు.
గ్రామంలో మహిళలపై జరిగే అమానుష ఘటనలపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాలు నివారించడానికి రక్షణ చర్యలు పాటించాలని తెలిపారు. మహిళలు ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు 100 డయల్ వినియోగించాలని చెప్పారు.
ఎస్పీ శ్వేత ఆధ్వర్యంలో నిర్బంధ తనిఖీలు - నిర్బంధ తనిఖీలు
కామారెడ్డి జిల్లాలోని పెద్దమల్లారెడ్డి గ్రామంలో ఎస్పీ శ్వేత ఆధ్వర్యంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ధృవ పత్రాలు లేని 80 ద్విచక్ర వాహనాలు, 18 ఆటోలకు జరిమానా విధించారు.
ఎస్పీ శ్వేత ఆధ్వర్యంలో నిర్బంధ తనిఖీలు