BRS Election Plan in Kamareddy 2023 : కేసీఆర్ పోటీ చేస్తుండటంతో కామారెడ్డి నియోజకవర్గానికి ఎనలేని ప్రాధాన్యత లభిస్తోంది. నిత్యం ఏదో రకంగా వార్తల్లో నిలుస్తూ రాష్ట్రం దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ పోటీ నేపథ్యంలో ఇప్పటికే నియోజకవర్గానికి కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఎన్నికల కోడ్ రావడంతో స్థానిక నాయకత్వం గెలుపు ప్రణాళికల్లో నిమగ్నమైంది. ఇటీవల కేటీఆర్(KTR) కామారెడ్డిలో సభ నిర్వహించి క్యాడర్‌కు దిశానిర్దేశం చేశారు. దేశంలోనే అత్యధిక మెజార్జీతో గెలిపించేలా ప్రణాళికలు ఉండాలన్నారు. ఈ నేపథ్యంలో సీఎం రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్‌రెడ్డి కామారెడ్డికి వచ్చి స్థానిక నేతలతో కలిసి ప్రచార, గెలుపు వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు.
KTR On BRS Campaign In Kamareddy Constituency: ఇటీవల జిల్లా కేంద్రంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో మంత్రి కేటీఆర్ 266 పోలింగ్ కేంద్రాల బాధ్యతలను సీనియర్ నేతలకు అప్పగించాలని నిర్దేశించారు. ఈ నేపథ్యంలో కొన్ని పోలింగ్ కేంద్రాలకు కన్వీనర్‌తో పాటు సహాయ కన్వీనర్‌ను నియమించారు. ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తన సొంత గ్రామమైన బస్వాపూర్లోని ఓ పోలింగ్ కేంద్రం బాధ్యతలను తీసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ముజీబొద్దిన్, సీనియర్ నాయకుడు నిట్టు వేణుగోపాల్‌రావు, మాచా రెడ్డి ఎంపీపీ నర్సింగరావులు బాధ్యతలను తీసుకున్నారు. కన్వీనర్లుగా నియమితులైన నేతలు గ్రామాలకు వెళ్లి వంద ఓటర్లకో ఇంఛార్జ్ నియమించనున్నారు. ఇలా ఒక పోలింగ్ కేంద్రం పరిధిలో పది మంది క్రియాశీల కార్యకర్తలకు ఎన్నికల బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు.
CM KCR Election Tour : సీఎం కేసీఅర్ ఎన్నికల సభల షెడ్యూల్ ఖరారు.. ఈనెల 15 నుంచి నవంబర్ 9 వరకు..