కామారెడ్డి జిల్లా బాన్సువాడలో భాజపా బహిరంగ సభ ఉత్సాహంగా జరిగింది. ఈ సభలో కాంగ్రెస్ నేత మాల్యాద్రి రెడ్డి... భాజపా తీర్ధం పుచ్చుకున్నారు. మాల్యాద్రిరెడ్డికి కండువా కప్పిన బండి సంజయ్... పార్టీలోకి ఆహ్వానించారు.
తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విడుదల చేసిన ఉద్యోగాల భర్తీ వివరాలపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు విమర్శలు గుప్పించారు. ఒకవేళ రాష్ట్రంలో తెరాస నిజంగానే లక్షా పైచిలుకు ఉద్యోగాలు భర్తీ చేసుంటే కేటీఆర్ ఈపాటికే మెడలో బోర్డు వేసుకుని తిరిగేవాడని ఎద్దేవా చేశారు.
2018 డిసెంబర్లో రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కేసీఆర్... రాష్ట్రంలో ఉద్యోగం లేని ప్రతి నిరుద్యోగికి రూ. 3వేలు ఇస్తానని హామీ ఇచ్చాడు. ఇప్పటి వరకు ఏ ఒక్కరికి నిరుద్యోగ భృతి రాలేదు. ప్రతి ఒక్క నిరుద్యోగికి సీఎం రూ. 72వేలు బాకీ ఉన్నడు.