కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో భాజపాకి సంబంధించిన ఫ్లెక్సీలు, జెండాలను తొలగిస్తూ.. అధికార తెరాసవి తొలగించకపోవడంతో భాజపా నేతలు నిరసన వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.
మున్సిపల్ సిబ్బంది ఏకపక్ష ధోరణి వదిలి అందర్నీ ఒకేలా చూడాలని డిమాండ్ చేశారు. పక్షపాత ధోరణి వీడాలని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో ఏ పార్టీకి సంబంధించిన సభలు జరిగినా వారి ఫ్లెక్సీలు, జెండాలు తొలగించాలని హితవు పలికారు.