తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ భాజపా రాష్ట్ర కమిటీ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈమేరకు కామారెడ్డి నుంచి బయలుదేరిన జిల్లా నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. వారిని వివిధ ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లకు తరలించారు.
అసెంబ్లీ ముట్టడికి యత్నించిన భాజపా నేతల అరెస్టు
సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని భాజపా రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. అసెంబ్లీ ముట్టడికి యత్నించిన కామారెడ్డి జిల్లా భాజపా నేతలను పోలీసులు అడ్డుకున్నారు.
అసెంబ్లీ ముట్టడికి యత్నించిన భాజపా నేతల అరెస్టు
ప్రభుత్వానికి వ్యతిరేకంగా భాజపా నేతలు నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపాలన్న కేసీఆర్.. ఇప్పుడు ఎందుకు జరపడం లేదని ప్రశ్నించారు. ఎంఐఎం పార్టీకి సానుకూలంగా మారి విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం లేదని ఆరోపించారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని, రాబోయేది భాజపా ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.
- ఇదీ చూడండి:కారు నేర్చుకుంటూ.. కానరాని లోకాలకు..