ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూములను సర్వే చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి కలెక్టరేట్ వద్ద భాజపా నేతలు ధర్నా చేపట్టారు. ఎంతో మంది పట్టభద్రులను తీర్చిదిద్దిన కళాశాల భూములు... నేడు కబ్జాకోరుల కబంధ హస్తాల్లో చిక్కుకుపోయాయని నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ కాటిపల్లి వెంకటరమణా రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
కబ్జా భూములను సర్వే చేయాలని భాజపా నేతల ధర్నా - telangana news
ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూములను సర్వే చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి కలెక్టరేట్ వద్ద భాజపా నేతలు ధర్నా చేపట్టారు. ఎంతో మంది పట్టభద్రులను తీర్చిదిద్దిన కళాశాల భూములు.. నేడు కబ్జాకోరుల కబంధ హస్తాల్లో చిక్కుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాల చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలని డిమాండ్ చేశారు.

BJP leaders dharna at the Collectorate
ఇకనైనా కలెక్టర్ స్పందించి కబ్జాకు గురైన భూమి ఎంత, ఎవరు కబ్జా చేశారనేదానిపై సర్వే నిర్వహించి ప్రజలకు తెలియజేయాలని కోరారు. కళాశాల చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలని డిమాండ్ చేశారు. నిమ్మకు నీరెత్తినట్లు కలెక్టర్ వ్యవహరిస్తే భూముల కబ్జా గురించి ప్రజల్లోకి తీసుకుపోయి ఉద్యమం ఉద్ధృతం చేస్తామని అన్నారు.