భారత్ బంద్‌లో భాగంగా కామారెడ్డిలో తెరాస ధర్నా చేసిన ప్రాంతాన్ని భాజపా నాయకులు శుభ్రం చేశారు. పట్టణ శివారులోని టెక్రియాల్ చౌరస్తా వద్ద ఎమ్మెల్సీ కవిత నిరసన తెలిపారు. మధ్యాహ్నం వరకు తెరాస ఆందోళన పూర్తి కాగా... ఆ తర్వాత భాజపా నియోజకవర్గ ఇంఛార్జ్ వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో ఆ ప్రాంతాన్ని ఫినాయిల్, బ్లీచింగ్ పౌడర్, నీళ్లతో శుభ్రం చేసి, పసుపు నీళ్లు చల్లారు.
కవిత ఆందోళన చేపట్టిన చౌరస్తాను శుభ్రం చేసిన భాజపా - టెక్రియాల్ చౌరస్తాను శుభ్రం చేసిన భాజపా నాయకులు
కామారెడ్డిలో పట్టణ శివారులోని టెక్రియాల్ వద్ద భాజపా నాయకులు శుభ్రం చేశారు. అంతకు ముందు అక్కడ ఎమ్మెల్సీ కవిత... భారత్ బంద్‌లో భాగంగా ఆందోళన చేపట్టారు.
కవిత ఆందోళన చేపట్టిన చౌరస్తాను శుభ్రం చేసిన భాజపా నాయకులు