మున్సిపల్ పోరు సిద్ధమైన కాషాయదళం - కామారెడ్డిలో మున్సిపల్ ఎన్నికలు 2019
మున్సిపాలిటీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. పార్టీలన్నీ ప్రచారానికి శ్రీకారం చుడుతున్నాయి. అందరికంటే ముందే ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు కామారెడ్డిలో భాజపా పాదయాత్ర చేపట్టింది.
కామారెడ్డిలో మున్సిపల్ ఎన్నికలు 2019
కామారెడ్డి మున్సిపాలిటీలో భాజపా ప్రచారానికి పదును పెట్టింది. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కాటిపల్లి వెంకట రమణారెడ్డి పట్టణంలోని అన్ని వార్డుల్లో పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. కాకతీయనగర్ కాలనీలోని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పాదయాత్రను ప్రారంభించారు. త్వరలో జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో భాజపా అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని తెలిపారు. సుమారు 30 నుంచి 39 స్థానాలు గెలుచుకుని ఛైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
- ఇదీ చూడండి : ఫోన్ మాట్లాడండి... మీకే డబ్బులు వస్తాయ్!