కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో రైతు వేదికను ప్రారంభించేందుకు వచ్చిన వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిని భాజపా నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ కార్యక్రమం వద్దకు వచ్చి ఆందోళన చేపట్టారు.
మంత్రి నిరంజన్‌రెడ్డిని అడ్డుకున్న భాజపా కార్యకర్తలు - తెలంగాణ వార్తలు
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో భాజపా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రైతు వేదికను ప్రారంభించేందుకు వచ్చిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిని అడ్డుకునేందుకు యత్నించగా.. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మంత్రి నిరంజన్‌రెడ్డిని అడ్డుకున్న భాజపా కార్యకర్తలు
రైతు వేదికలపై ప్రధాన మంత్రి ఫొటో పెట్టాలని డిమాండ్ చేశారు. తెరాసకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని పరిస్థితిని నియంత్రించారు.
ఇదీ చూడండి: ఎలక్ట్రానిక్ పరిశ్రమలో పేలుడు.. కార్మికురాలు మృతి