కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో నాలుగు కరోనా కేసులు నమోదయ్యాయి. పాజిటివ్ వచ్చినవారితో సన్నిహితంగా మెలిగిన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాలని బాన్సువాడ డీఎస్పీ దామోదర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. పట్టణంలో కరోనా వ్యాప్తిని నిరోధించడానికి సహకరించాలని కోరారు. పట్టణ ప్రజలు లాక్డౌన్లో స్వచ్ఛందంగా పాల్గొనాలన్నారు.
ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలి: డీఎస్పీ - బాన్సువాడ డీఎస్పీ దామోదర్ రెడ్డి
కరోనా వైరస్ విస్తృతి రోజు రోజుకు పెరుగుతోన్న వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బాన్సువాడ డీఎస్పీ దామోదర్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనా పాజిటివ్ వచ్చినవారితో సన్నిహితంగా తిరిగిన ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి కొవిడ్-19 పరీక్షలు చేయించుకోవాలన్నారు.
ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలి: డీఎస్పీ
బాన్సువాడ పట్టణ వాసులు కొందరు దిల్లీలో జరిగిన మత సంబంధిత కార్యక్రమంలో పాల్గొని వచ్చినందున పట్టణంలో వైరస్ విస్తరించిందని డీఎస్పీ తెలిపారు.