బ్యాంకు ఉద్యోగుల రెండు రోజుల సమ్మెలో భాగంగా కామారెడ్డిలో ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగులు విధులు బహిష్కరించారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ తీశారు. తమపై పని భారం తగ్గించాలని కోరారు. వారంలో ఐదు రోజులు మాత్రమే పని ఉండాలన్నారు. వేతన సవరణ చేయాలని డిమాండ్ చేశారు.
రెండో రోజు కొనసాగిన బ్యాంకుల సమ్మె