అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం పోరాడిన గొప్ప వ్యక్తి బాబు జగ్జీవన్ రాం అని కామారెడ్డి జిల్లా డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి అన్నారు. బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోని ఎతోండ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన జగ్జీవన్ రాం విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులు అర్పించారు.
'అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం పోరాడిన మహనీయుడు' - Kamareddy District News
కామారెడ్డి జిల్లాలో డాక్టర్ బాబు జగ్జీవన్ రాం 114వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోని ఎతోండ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన జగ్జీవన్ రాం విగ్రహాన్ని డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం పూలమాల వేసి నివాళులు అర్పించారు.
జగ్జీవన్ రాం జయంతి వేడుకలు
బాబాసాహెబ్ అంబేడ్కర్ తర్వాత కులవివక్షపై పోరాడిన గొప్ప నాయకుడు జగ్జీవన్ రాం అని కీర్తించారు. ఈ కార్యక్రమంలో కోటగిరి జడ్పీటీసీ శంకర్ పటేల్, ఎంపీపీ వల్లేపల్లి సునీత శ్రీనివాస్, కోటగిరి మార్కెట్ కమిటీ ఛైర్మన్ గంగాధర్, జిల్లా రైతు బంధు అధ్యక్షులు అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.