కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి మండలం ఎల్పుగొండ గ్రామంలో జిల్లాస్థాయి భూగర్భ జలాల రైతుల అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే భూగర్భ జలాల వినియోగంపై అవగాహన కల్పించారు.
భూగర్భజలాలపై అవగాహన సదస్సు - kamareddy district
అవసరం లేకున్నా రైతులు బోరు మోటర్ నుంచి నీటిని తోడేయవద్దని కామారెడ్డి అదనపు కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే సూచించారు. జిల్లాలోని ఎల్పుగొండలో భూగర్భజలాలపై అవగాహన సదస్సు ఆయన మాట్లాడారు.
భూగర్భజలాలపై అవగాహన సదస్సు
అవసరం లేకున్నా బోరు మోటర్ నుంచి నీటిని వృథాగా తోడేయవద్దని ఆయన సూచించారు. అధికంగా భూగర్భ జలాలు తోడేయడం వల్ల భవిష్యత్ తరాల భవితవ్యం ప్రశ్నార్థకం అవుతుందని హెచ్చరించారు.
ఇవీ చూడండి:పోలీస్ కొలువు మాకొద్దు బాబోయ్..