తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇసుక తీసేందుకు వెళ్లి మంజీరాలో చిక్కుకున్న ఆరుగురు - మంజీరా నదిలో చిక్కుకున్న ఆరుగురు

కామారెడ్డి జిల్లా ఖత్గావ్ వద్ద ప్రభుత్వ పనుల కోసం వెళ్లి మంజీరా నదిలో చిక్కుకుపోయిన ఆరుగురిని అధికారులు కాపాడారు.

మంజీరా నదిలో చిక్కుకున్నవారిని కాపాడిన అధికారులు
మంజీరా నదిలో చిక్కుకున్నవారిని కాపాడిన అధికారులు

By

Published : Sep 27, 2020, 11:25 AM IST

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం ఖత్గావ్ వద్ద మంజీరా నదిలో చిక్కుకున్నవారిని గ్రామస్థులు, అధికారులు కాపాడారు. ప్రభుత్వ పనుల కోసం లారీల్లో ఇసుక తరలించేందుకు వెళ్లిన ఆరుగురు వరదలో చిక్కుకుపోయారు.

గమనించిన స్థానికులు.. అధికారులకు సమాచారం అందించారు. జేసీబీ సాయంతో వారందరిని బయటకు తీశారు. ఈ కార్యక్రమాన్ని డీఎస్పీ దామోదర్ రెడ్డి, సీఐ సాజిద్, ఎస్సై సాయన్న, తహసీల్దార్ వెంకట్రావ్ పర్యవేక్షించారు.

ఇదీ చూడండి: సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతగా నిర్మల్‌లో మంత్రి ఇంద్రకరణ్​ ర్యాలీ

ABOUT THE AUTHOR

...view details