కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం పెద్ద ఎడ్గి గ్రామానికి చెందిన ఓ మహిళపై ఓ వ్యక్తి కొబ్బరిబొండాల కత్తితో దాడికి పాల్పడ్డాడు. మహిళ భర్త తాగుడుకు బానిసవ్వగా.. కొద్ది నెలలుగా అతనికి దూరంగా ఉంటున్నారు. ఇదే ఆసరాగా చేసుకుని భర్త స్నేహితుడు దత్తా గౌడ్.. బాధితురాలితో అసభ్యంగా ప్రవర్తించాడు. తనతో స్నేహం చేయాలని, తన కోరిక తీర్చాలని తరచూ ఇబ్బందులకు గురిచేసేవాడు.
కొబ్బరిబొండాల కత్తితో మహిళపై హత్యాయత్నం - attempt murder on lady with coconut sword
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం పెద్ద ఎడ్గి గ్రామానికి చెందిన ఓ మహిళపై పాతకక్షలతో కొబ్బరిబొండాల కత్తితో దాడి చేశారు. ఆమె మెడకు, చేతులకు తీవ్ర గాయాలవ్వగా బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
కొబ్బరిబొండాల కత్తితో మహిళపై హత్యాయత్నం
ఆరు నెలల క్రితం ఇదే విషయమై బాధిత మహిళ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చింది. పాతకక్షలు మనసులో పెట్టుకుని... శనివారం ఒంటరిగా వెళ్తున్న ఆమెపై దాడికి పాల్పడ్డాడు. బిచ్కుందలోని హెచ్పీ గ్యాస్ గోదాం పక్కన మాటు వేసి కొబ్బరిబొండాల కత్తితో మహిళపై దాడి చేశారు. మెడకు, చేతులకు తీవ్రగాయాలుకాగా.. బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. దాడి చేసిన నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండిఃపెన్గంగ నది మధ్యలో యథేచ్ఛగా ఇసుక దందా