తెలంగాణ

telangana

చేతబడి చేసిందనే అనుమానంతో దాడి

By

Published : May 21, 2020, 4:45 PM IST

Updated : May 21, 2020, 8:25 PM IST

మూఢ నమ్మకాలను, మంత్రాలను నమ్మవద్దంటూ ప్రభుత్వం ఎంత ప్రచారం చేసినా లాభం లేకుండా పోతుంది. కొన్ని ప్రాంతాల్లో చేతబడి చేస్తున్నారనే అనుమానాలతో దాడులకు పాల్పడుతున్నారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో చోటుచేసుకుంది.

attacked-on-suspicion-of-magic-spells-at-kamareddy
చేతబడి చేసిందనే అనుమానంతో దాడి

చేతబడి చేస్తున్నారనే నేపంతో కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రానికి చెందిన 60 ఏళ్ల వృద్ధులితోపాటు ఆమె కుమార్తెను ఓ కుటంబ సభ్యులు చితకబాదారు. ఆ మండల కేంద్రానికి చెందిన పోతారం లింబవ్వ, తన కొడుకు రాజు, కోడలు వనిత, కుమార్తె సావిత్రితో కలిసి గత 25 ఏళ్లుగా లక్ష్మీనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. అదే కాలనీలో నివసించే త్యాగాల పెద్ద లింబయ్య, మనవరాలు అనారోగ్యం బారిన పడింది.

ఈ తరుణంలో స్థానికంగా ఉంటున్న లింబవ్వ చేతబడి చేయడం వల్లనే తన 10 ఏళ్ల మనుమరాలు అనారోగ్యం బారిన పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద లింబయ్య, తన కుటుంబ సభ్యులు ఎనిమిది మంది కలిసి లింబవ్వ ఇంటికి వెళ్లి దాడి చేశారు. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న లింబవ్వ, ఆమె కుమార్తె సావిత్రిలపై ఆ కుటుంబ సభ్యులు కర్రలతో దాడి చేశారు. ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లడం వల్ల కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు.

చేతబడి చేసిందనే అనుమానంతో దాడి

ఇదీ చూడండి :'ఆదాయాన్నిచ్చే పంటలు వేసేలా రైతులను ఒప్పించండి'

Last Updated : May 21, 2020, 8:25 PM IST

ABOUT THE AUTHOR

...view details