తెలంగాణ

telangana

ETV Bharat / state

అర్హులందరికీ డబుల్ బెడ్​రూం ఇళ్లిస్తాం: పోచారం - రెండు పడక గదుల ఇళ్లను పంపిణీ చేసిన పోచారం

పేదవారి సొంతింటి కల నిజం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బీర్కుర్​ మండలం బరంగ్​ఎడ్గి గ్రామంలో రెండు పడక గదుల ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

assembly speaker pocharam srinivasa reddy distributed double bed room houses in kamareddy district
రెండు పడక గదుల ఇళ్లను పంపిణీ చేస్తున్న సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి

By

Published : Jan 27, 2021, 4:31 PM IST

Updated : Jan 27, 2021, 5:39 PM IST

రాష్ట్రప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తోందని శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా బీర్కుర్​ బరంగ్​ఎడ్గి గ్రామంలో రూ.2.52 కోట్లతో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లను లబ్ధిదారులకు ఆయన పంపిణీ చేశారు. పేదవారి సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంటు పథకాలు అమలు చేస్త్తున్న ఎకైక సీఎం కేసీఆరేనని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, ఆర్డీవో రాజాగౌడ్, బాన్సువాడ నియోజకవర్గ తెరాస ఇన్​ఛార్జ్​ పోచారం సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.

ఇదీ చూడండి :పీఆర్సీపై తుది నిర్ణయం ముఖ్యమంత్రిదే: శ్రీనివాస్ గౌడ్

Last Updated : Jan 27, 2021, 5:39 PM IST

ABOUT THE AUTHOR

...view details