కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల పరిధిలో రెండో విడత ప్రాదేశిక ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి. పోచారం గ్రామంలో సభాపతి శ్రీనివాస్‌రెడ్డి దంపతులు ఓటు వేశారు. ప్రతి ఐదు సంవత్సరాలకొకసారి మనల్ని పాలించే వారిని ఎన్నుకునేందుకు కల్పించిన హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని సూచించారు. పోలింగ్ రోజు ఎక్కడున్నా అందరూ తమ గ్రామాలకు వచ్చి ఓటు వేయాలని కోరారు.
పోచారంలో ఓటు వేసిన సభాపతి దంపతులు - kamareddy
కామారెడ్డి జిల్లా పోచారం గ్రామంలో సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సతీసమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు.
పోచారంలో ఓటు వేసిన సభాపతి దంపతులు