తెలంగాణ

telangana

ETV Bharat / state

కామారెడ్డిలో హుండీ దొంగల ముఠా అరెస్ట్​ - Arrest of Hundi burglary gang in Kamareddy police latest news

పలు దేవాలయాల్లో హుండీలు దొంగతనం చేసి తప్పించుకు తిరుగుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను కామారెడ్డి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. కేటుగాళ్లను పట్టుకోవడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషించాయని ఎస్పీ శ్వేత తెలిపారు.

కామారెడ్డిలో హుండీ దొంగల ముఠా అరెస్ట్​

By

Published : Oct 12, 2019, 12:57 PM IST

కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గొల్లపల్లి గ్రామం వద్ద కామారెడ్డి రూరర్ ఇన్​స్పెక్టర్​ కె. చంద్రశేఖర్ రెడ్డి బృందం వాహనాల తనిఖీలు నిర్వహించారు. అటుగా బైక్ పై వస్తున్న ఇద్దరు వ్యక్తులు భయపడి పారిపోవడం గమనించిన పోలీసుల అనుమానం వచ్చి వారిని వెంబడించి పట్టుకున్నారు. వారిని విచారించగా గుళ్లలో దొంగతనం చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులు భూక్యమంగ్యా, భూక్యగణేష్,​ రాజుగా గుర్తించారు. కేటుగాళ్లను పట్టుకోవడంలో సీసీ కెమెరాల కీలక పాత్ర పోషించాలని ఎస్పీ శ్వేత తెలిపారు. దొంగతనం చేసిన వారి వద్ద నుంచి 1,16,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. వీరిని పట్టుకోవడంలో ముఖ్యపాత్ర పోషించిన ఒక కానిస్టేబుల్, హోంగార్డులకు నగదు బహుమతిని అందించారు.

కామారెడ్డిలో హుండీ దొంగల ముఠా అరెస్ట్​

ABOUT THE AUTHOR

...view details