దేశ ప్రజలకు రక్షణగా నిలిచే ఆర్మీ జవాన్ కుటుంబ సభ్యులకే రక్షణ లేకుండా పోతోందని ఓ భారత సైనికుడు ఆవేదన వ్యక్తం చేశాడు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చిట్యాలకు చెందిన జవాన్ సప్పేటి స్వామి తన తండ్రి మూడు రోజులుగా కన్పించట్లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కొద్ది రోజులుగా తమ వ్యవసాయ భూమికి సంబంధించి వివాదాలు కొనసాగుతున్నాయని... పిప్పిరి ఆంజనేయులు తమ భూమిని పట్టా చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 6 ఎకరాల భూమి గుండ్రెడ్డి సాయిరెడ్డి అక్రమంగా తనపేరిట మార్పిడి చేసుకున్నాడని... ఈ విషయమై 15 రోజుల క్రితం వాట్సాప్ గ్రూపులలో వీడియో పోస్ట్ చేశానని తెలిపాడు. తన తండ్రి ఒంటరిగా దొరికినప్పుడు కిడ్నాప్ చేస్తామని గుండ్రెడ్డి సంగారెడ్డి, ఆయన కుమారుడు రమేశ్ రెడ్డి బహిరంగంగా బెదిరించారన్నాడు. పిప్పిరి ఆంజనేయులు, గుండ్రెడ్డి సంగారెడ్డి, రమేశ్ రెడ్డిలపై అనుమానం వ్యక్తం చేశాడు. పోలీసులు వెంటనే విచారించి న్యాయం చేయాలని స్వామి విజ్ఞప్తి చేశాడు.
జవాన్ తండ్రి కిడ్నాప్.. ప్రత్యర్థులపై అనుమానం
భూవివాదాలతో ఓ ఆర్మీ జవాన్ తండ్రి కనిపించకుండా పోయాడు. ఒక్కడివి కన్పిస్తే కిడ్నాప్ చేస్తామని ప్రత్యర్థి వర్గం బహిరంగంగా బెదిరించటంతో... వారిపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ARMY SOLDIERS FATHER KIDNAP
TAGGED:
ARMY SOLDIERS FATHER KIDNAP