కేంద్రప్రభుత్వం రైల్వే రంగాన్ని ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ కామారెడ్డిలోని రైల్వేస్టేషన్ ఎదుట ఏఐటీయూసీ నాయకులు ధర్నా చేపట్టారు. అనంతరం స్టేషన్ సూపరింటెండెంట్ సూరజ్‌కి వినతిపత్రం అందజేశారు. దేశంలో బ్రిటిష్ పరిపాలనలో కూడా రైల్వేలు బ్రిటిష్ ప్రభుత్వ అధీనంలో నడిచేవని.. స్వతంత్రం తరువాత రైల్వే సంస్థ మొత్తంగా మన ప్రభుత్వపరం అయిందని అని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఎస్ఆర్ శేఖర్ తెలిపారు.
రైల్వేరంగ ప్రైవేటీకరణను రద్దు చేయాలి: ఏఐటీయూసీ - kamareddy latest news
రైల్వే రంగాన్ని ప్రైవేటుపరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ కామారెడ్డి రైల్వే స్టేషన్ ముందు ఏఐటీయూసీ నాయకులు ధర్నా నిర్వహించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ స్టేషన్ సూపరింటెండెంట్‌కు వినతిపత్రం అందజేశారు.
రైల్వేరంగ ప్రైవేటీకరణను రద్దు చేయాలి: ఏఐటీయూసీ
ఆ నాటి నుంచి నేటి వరకు కేంద్రంలో ఉన్న పాలకులు రైల్వేను అనేక రకాలుగా అభివృద్ధి చేశారే కాని ఇలా ప్రైవేటుపరం చేయలేదని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు భాజపా ప్రభుత్వం రైల్వేరంగాన్ని ప్రైవేటీకరణ చేయాలని చూడడం సిగ్గు చేటని విమర్శించారు. వెంటనే ఈ నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలని లేని ఎడల ఆందోళనను ఉద్ధృతం చేస్తామని వారు హెచ్చరించారు.
ఇదీ చూడండి :రాష్ట్రంలో 42 వేలు దాటిన కరోనా కేసులు.. 400పైగా మరణాలు