కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం బస్వాపూర్‌లో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పర్యటించారు. సుమారు ఒక కోటి రూపాయలతో నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు. గ్రామంలో నిర్మించిన వైకుంఠధామం, రైతు వేదిక భవనం, మహిళ సమైక్య భవనాన్ని ప్రారంభించారు.
గ్రామ అభివృద్ధే దేశాభివృద్ధి: నిరంజన్ రెడ్డి - వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వార్తలు
గ్రామ అభివృద్ధే దేశాభివృద్ధని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం బస్వాపూర్‌లో సుమారు కోటి రూపాయలతో నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్‌ను ప్రారంభించారు.
గ్రామ అభివృద్ధే దేశాభివృద్ధి: నిరంజన్ రెడ్డి
గ్రామం అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని మంత్రి అన్నారు. తెరాస ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చిందని గుర్తు చేశారు. త్వరలో అన్నదాతల ఖాతాల్లో రైతు బంధు సొమ్ము జమ అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి:రజినీకాంత్‌కు అస్వస్థత.. జూబ్లీహిల్స్ అపోలోలో చేరిన సూపర్ స్టార్