తెలంగాణ

telangana

ETV Bharat / state

వ్యవసాయ రంగానికి పెద్దపీట: నిరంజన్​ రెడ్డి

వ్యవసాయ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని వ్యవసాయ, మార్కెటింగ్​ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో పర్యటించారు.

agriculture minister niranjan reddy tour in kamareddy district
వ్యవసాయ రంగానికి పెద్దపీట: నిరంజన్​ రెడ్డి

By

Published : Feb 21, 2021, 4:37 PM IST

కామారెడ్డి జిల్లా పిట్లం, బిచ్కుంద, మద్నూర్ మండలాల్లో రైతు వేదికలను వ్యవసాయ, మార్కెటింగ్​ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఆయన పేర్కొన్నారు.

రైతు వేదిక ప్రారంభిస్తున్న నిరంజన్​ రెడ్డి

రైతులకు ఉచిత విద్యుత్, రైతు బీమా, పంట సాగుకు పెట్టుబడి ఇలా రకరకాలుగా రైతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని అన్నారు. మంత్రితో పాటు జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, కామారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్​పర్సన్, ఎమ్మెల్యే హనుమంత్ షిండే ఉన్నారు.

మొక్క నాటిన మంత్రి

ఇదీ చదవండి:'మంథనిలో లీగల్‌ ఫ్యాక్షన్‌ నడుస్తోంది'

ABOUT THE AUTHOR

...view details