కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోని ఆదర్శనగర్ కాలనీలో ప్రమాదవశాత్తు మహమ్మద్ జాని చావుష్ మురికి కాలువలో పడి మృతి చెందాడు. ఎల్లారెడ్డి పట్టణంలో ఓ మసీదులో పనిచేస్తూ జీవనం సాగిస్తున్న మహమ్మద్ జాని రోజు మాదిరిగానే పనికి వెళ్తుండగా కాలువలో పడిపోయాడు.
ప్రమాదవశాత్తు కాలువలో పడి వృద్ధుడి మృతి - మురికి కాలువలో పడి మహమ్మద్ జాని చావుష్ మృతి
ప్రమాదవశాత్తు మురికి కాలువలో పడి ఓ వృద్ధుడు మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలో చోటు చేసుకుంది.
ప్రమాదవశాత్తు కాలువలో పడి వృద్ధుడి మృతి
కుటుంబ సభ్యులు అలీ షాన్ హుస్సేన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్వేత తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.