తెలంగాణ

telangana

ETV Bharat / state

పసికందుకు తల్లిని లేకుండా చేసిన ప్రమాదం - Bike lorry crashes in Nijansagar

ఓ రోడ్డు ప్రమాదం పసికందుకు తల్లిని లేకుండా చేసింది. రాఖీ పండుగ సందర్భంగా భార్యాభర్తలు ద్విచక్రవాహనంపై పుట్టింటికి వెళ్తుండగా ఘోర ప్రమాదం సంభవించింది. ఎదురుగా వచ్చిన బైక్​ను లారీ వెనుక భాగం ఢీకొట్టింది. లారీ టైర్ల కింద పడి మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనలో భర్త, మూన్నెళ్ల శిశువు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదం కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది.

Accident without mother to infant child at nizamsagar road kamareddy
పసికందుకు తల్లిని లేకుండా చేసిన ప్రమాదం

By

Published : Aug 3, 2020, 10:45 PM IST

పసికందుకు తల్లిని లేకుండా చేసిన ప్రమాదం

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌లో రోడ్డు ప్రమాదం.. ఓ ముక్కుపచ్చలారని పసికందుకు తల్లి లేకుండా చేసింది. ద్విచక్రవాహనంపై వెళ్తుండగా...లారీ వెనుకభాగం తగిలింది. వెనక కూర్చున్న భార్య లారీ టైర్లకింద పడి అక్కడికక్కడే మరణించింది. ఈ ఘటనలో తల్లి అక్కడికక్కడే మృతి చెందింది. పెద్దకొడప్గల్‌ మండలంలోని విఠల్‌ తండాకు చెందిన దంపతులు.. తమ మూన్నెళ్ల బాబుతో రాఖీ పండుగకు తాడ్వాయికి వెళ్తున్నారు.

భర్త, శిశువు స్వల్పగాయాలతో బయటపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. బోరున విలపిస్తున్న చిన్నారిని అక్కడకు వచ్చిన పోలీసులు ఎత్తుకుని లాలించాడు. ఆ విషాదకర ఘటన స్థానికులను కలచివేసింది.

ఇదీ చూడండి :ప్లాస్మాను దానం చేయాలని కోరిన హీరో నాని

ABOUT THE AUTHOR

...view details