తెలంగాణ

telangana

ETV Bharat / state

చెట్టును ఢీకొట్టిన కారు...స్పాట్లో నలుగురు దుర్మరణం - car accident at kamareddy

శంషాబాద్ విమానాశ్రయంలో సంతోషంగా బంధువుకు వీడ్కోలు పలికారు. వీడ్కోలు పలికి తిరిగి వస్తుండగా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన  కామారెడ్డిలో చోటుచేసుకుంది.

accident_at_kamareddy_four_members_spot_dead
చెట్టును ఢీకొట్టిన కారు... నలుగురు దుర్మరణం

By

Published : Dec 9, 2019, 8:56 AM IST

Updated : Dec 9, 2019, 11:48 AM IST

కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. శంషాబాద్​లో బంధువుకు వీడ్కోలు పలికి... హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్తుండగా కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్​తో సహా నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

చెట్టును ఢీకొట్టిన కారు... నలుగురు దుర్మరణం
కారు నుజ్జునుజ్జు అయిపోవడం వల్ల మృతదేహాలను వెలికి తీసేందుకు ఇబ్బంది ఏర్పడింది. దీంతో గ్యాస్ కట్టర్​తో కట్ చేసి మృతులను బయటకు తీశారు. మృతులు నిజమామాబాద్ జిల్లా పద్మానగర్​కు చెందిన తల్లీ కూతుళ్లు లావణ్య, రోషిణి... నవీపేట్​కు చెందిన ప్రశాంత్, సుశీల్​ ఉన్నారు,
Last Updated : Dec 9, 2019, 11:48 AM IST

ABOUT THE AUTHOR

...view details