కామారెడ్డి జిల్లా మాచారెడ్డి, బిక్నూర్ మండలాల్లో గల శ్రీ చైతన్య టెక్నో స్కూళ్లను నిషేధించాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయకులు డిమాండ్ చేశారు. మండల ఏబీవీపీ శాఖల ఆధ్వర్యంలో ఎంఈఓలకు వినతి పత్రం అందజేయడానికి వెళ్లారు. మాచారెడ్డి మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో లేకపోవడం వల్ల అతని కుర్చీకి వినతి పత్రం అందజేశారు.
ఖాళీ కుర్చీకి.. తాళం వేసి ఉన్న తలుపులకు ఏబీవీపీ నాయకుల వినతి పత్రం - sri chaitanya techno schools in kamareddy
సామాన్య ప్రజలను మభ్యపెట్టి శ్రీచైతన్య టెక్నో పాఠశాల యాజమాన్యం పెద్ద ఎత్తున ఫీజులు దండుకుంటున్నాయని ఏబీవీపీ నాయకులు ఆరోపించారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి, బిక్నూర్ మండలాల్లోని శ్రీచైతన్య టెక్నో పాఠశాలలను నిషేధించాలని డిమాండ్ చేశారు.
ఏబీవీపీ నాయకుల ధర్నా
బిక్నూర్ మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం మధ్యాహ్నం 12 అయినా మూసి ఉండడం వల్ల తలుపులకు వినతిపత్రం అందజేసి ఏబీవీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. జిల్లాలో శ్రీ చైతన్య టెక్నో పాఠశాలలు.. సామాన్య ప్రజలను మభ్యపెట్టి పెద్ద ఎత్తున ఫీజులు దండుకుంటున్నాయని ఆరోపించారు. ఇలాంటి పాఠశాలలు నడపడానికి అనుమతించకూడదని డిమాండ్ చేశారు.