తెలంగాణ

telangana

ETV Bharat / state

కామారెడ్డి జడ్పీఛైర్మన్​ క్షమాపణ చెప్పాలని ఏబీవీపీ ధర్నా - ABVP Dharna to apologize to the Kamareddy JP chairman

దిశపై కామారెడ్డి జిల్లా జడ్పీఛైర్మన్​ శోభ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఏబీవీపీ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్​ కార్యాలయాన్ని ముట్టడించారు. మహిళా జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు.

ABVP Dharna to apologize to the Kamareddy JP chairman
కామారెడ్డి జడ్పీఛైర్మన్​ క్షమాపణ చెప్పాలని ఏబీవీపీ ధర్నా

By

Published : Dec 12, 2019, 2:47 PM IST

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్​ కార్యాలయాన్ని ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ముట్టడించారు. దిశ ఘటనపై జిల్లా పరిషత్​ ఛైర్మన్​ శోభ వ్యాఖ్యలు చేయడం సబబు కాదని, తాను యావత్తు మహిళా జాతికి క్షమాపణ చెప్పాలని బైఠాయించారు.

క్షమాపణ చెప్పే వరకు జరిగే పరిస్థితి లేదని భిష్మించుకూర్చున్నారు. 2 గంటల పాటు ఉద్రిక్తత నెలకొంది. ప్రస్తుతం శోభ ఇక్కడ లేరని... నిజామాబాద్​లో ఉన్నారని, వచ్చాక క్షమాపణ చెపుతారని స్థానిక సిబ్బంది తెలిపారు. పోలీసులు సర్ది చెప్పడంతో ధర్నా విరమించుకున్నారు.

కామారెడ్డి జడ్పీఛైర్మన్​ క్షమాపణ చెప్పాలని ఏబీవీపీ ధర్నా

ఇవీ చూడండి: కోట వైభవం భళా... సౌకర్యాలకై విలవిల

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details