కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఇంటిని ఏబీవీపీ కార్యకర్తలు ముట్టడించారు. అగ్ర వర్ణ కులాల పేదల(ఈడబ్ల్యుఎస్)కి రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. గోవర్ధన్ అందుబాటులో లేకపోవడంతో ఇంటిముందు బైఠాయించడానికి కార్యకర్తలు ప్రయత్నించగా పోలీసులు వారిని అరెస్టు చేశారు.
అగ్రవర్ణ కులాల పేదలకు రిజర్వేషన్లు కల్పించాలి: ఏబీవీపీ - ఏబీవీపీ తాజా వార్తలు
అగ్ర వర్ణ కులాల పేదలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏబీవీపీ ఆందోళన నిర్వహించింది. ఈ మేరకు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఇంటిని ముట్టడించింది. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు.
అగ్రవర్ణ కులాల పేదలకు రిజర్వేషన్లు కల్పించాలి: ఏబీవీపీ
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు దేశమంతా అమలు చేస్తున్నా కేవలం తెలంగాణలోనే అమలు కావడం లేదని ఏబీవీపీ నగర కార్యదర్శి మనోజ్ అన్నారు. వెంటనే రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పోరాడిన ప్రైవేటు ఉపాధ్యాయులను కరోనా సంక్షోభం దృష్ట్యా ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
ఇదీ చదవండి:వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టిన చర్యలపై మంత్రి కేటీఆర్ సమీక్ష