కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని ఐలాపూర్లో పైడా ఆకుల మహేశ్వరి అనే యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు ఇటీవలే తాడ్వాయి మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తితో వివాహం నిశ్చయమైంది. ఆగస్టు 8న వివాహం పెట్టుకున్నారు. ఈ విషయంలో ఆర్థిక ఇబ్బందులు తాళలేక తల్లిదండ్రులు ఇరువురు ఇంట్లో గొడవ పడ్డారు.
పెళ్లి ఆర్థిక భారమని మనస్తాపంతో యువతి ఆత్మహత్య - A young woman commits suicide in kamareddy district latest news
తన పెళ్లితో భవిష్యత్తులో తల్లిదండ్రులకు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువవుతాయనే ఆందోళనతో మనస్తాపం చెందిన ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. యువతి మృతితో కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పెళ్లి ఆర్థిక భారమవుతోందని మనస్తాపంతో యువతి ఆత్మహత్య
అది చూసి మహేశ్వరి ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో గదిలోకి వెళ్లి గడియ పెట్టుకొని పురుగుల మందు తాగింది. హుటాహుటిన కుటుంబ సభ్యులు కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఆమె మృతి చెందింది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేందర్ రెడ్డి తెలిపారు. యువతి మృతితో కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి.