young woman slapped a young man: కామారెడ్డి జిల్లాలో తనపై అసభ్యంగా ప్రవర్తిస్తోన్న యువకుడికి ఆ అమ్మాయి సరైనా బుద్ధి చెప్పింది. నెలరోజులుగా యువతితో అసభ్యంగా ప్రవర్తిస్తోన్న ఆ యువకుడు చేష్టాలకు ఆ యువతి భరించలేక పోయింది. దీంతో ఆ ఆకతాయిని చెప్పుతో కొట్టి దేహశుద్ధి చేసింది. ఈ దృశ్యాలన్ని అక్కడున్న కొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టగా అవి కాస్త వైరల్ అయ్యాయి. అనంతరం ఆ యువకుడిని స్థానికుల సహాయంతో పోలీసు స్టేషన్లో అప్పగించినట్లు తెలుస్తోంది.
ఆకతాయికి బుద్ధి చెప్పిన యువతి.. చెప్పుతో దాడి.. వీడియో వైరల్ - young woman slapped a young man
young woman slapped a young man: అర్ధరాత్రి ఒక స్త్రీ మన దేశంలో ఒంటరిగా ఎప్పుడైతే తిరగగల్గుతుందో అప్పుడే ఈ దేశానికి నిజమైన స్వతంత్య్రం వచ్చినట్లు అని గాంధీ మహాత్ముడు అన్నాడు. ప్రస్తుత రోజుల్లో ఆడవాళ్లు బయటకు వెళ్లాలి అంటే ఎంత భయపడుతున్నారో చూస్తున్నాం. స్కూల్ వెళ్లే పిల్లలు నుంచి వయో భారంతో బాధపడుతున్న ముసలి వారిని సైతం కొందరు అకతాయిలు ఎలా ఇబ్బంది పెడుతున్నారో మనం తరచూ చూస్తునే ఉన్నాం. అలాంటి పోకిరికి సరైనా గుణపాఠం చెప్పింది ఈ అమ్మాయి.
young woman slapped a young man