బ్లాక్ ఫంగస్‌తో రాష్ట్రంలో మరో మరణం చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గిద్ద గ్రామానికి చెందిన అంజల్ రెడ్డికి గత నెల 23వ తేదీన కరోనా సోకడంతో.. నిజామాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. 12 రోజుల పాటు చికిత్స పొందిన ఆయన.. కోలుకొని మే 8న డిశ్చార్జి అయ్యారు.
బ్లాక్ ఫంగస్‌తో మరో మరణం - black fungus latest updates
కొవిడ్ నుంచి కోలుకున్నవారికి.. బ్లాక్ ఫంగస్ మరో ముప్పుగా మారుతోంది. దేశంలో ప్రస్తుతం ఈ కేసులు అధిక సంఖ్యలో నమోదవుతువుతున్నాయి. ఇప్పటికే పలువురు ఫంగస్ బారిన పడి ప్రాణాలు కోల్పోగా.. రాష్ట్రంలోనూ మ్యూకర్మైకోసిస్ మరణాలు చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. కామారెడ్డి జిల్లాలో ఓ వ్యక్తి నిన్న ఫంగస్ ధాటికి బలయ్యాడు.
black fungus deaths
అనంతరం కన్ను ఎర్రబారి ఇబ్బందులు తలెత్తడంతో నిజామాబాద్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు వెళ్లగా.. వారు సరోజినీదేవి కంటి ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. సరోజినీ వైద్యులు పరీక్షించి.. బ్లాక్ ఫంగస్ సోకి ఉండొచ్చని భావించి కేర్ ఆసుపత్రికి రెఫర్ చేశారు. మే 11న అంజల్‌రెడ్డి కేర్ ఆసుపత్రిలో చేరారు. బ్లాక్‌ఫంగస్ సోకినట్లు నిర్ధారించిన వైద్యులు.. ఆయనకు ఓ కన్ను, దవడ తొలగించారు. అయితే అప్పటికే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో.. అతను మృతి చెందాడు.
ఇదీ చదవండి:ఆకలి కోరల్లో అభాగ్యులు