కామారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలకు చెందిన 35 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన బాన్సువాడ మండలం ఇబ్రహీంపేట ప్రాథమిక పాఠశాలలో జరిగింది. మధ్యాహ్న భోజనం వికటించడంతో విద్యార్థులంతా ఒక్కసారిగా అస్వస్థతకు లోనయ్యారు. కలుషిత ఆహారం తిన్న విద్యార్థులకు వాంతులు, విరోచనాలయ్యాయి.
food poison:మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులకు అస్వస్థత.. పరామర్శించిన స్పీకర్ - ఇబ్రహీంపేట పాఠశాలలో ఘటన
17:55 October 21
food poison:మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులకు అస్వస్థత.. పరామర్శించిన స్పీకర్
ఉపాధ్యాయులు వెంటనే అప్రమత్తమై విద్యార్థులందరిని బాన్సువాడ ఏరియా ప్రభుత్వ ఆస్పత్రి తరలించి చికిత్స అందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం విషయంలో జాగ్రత్తలు పాటించడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
విద్యార్థులను పరామర్శించిన స్పీకర్
ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్పీకర్ పోచారం ఆస్పత్రికి వచ్చి విద్యార్థులను పరామర్శించారు. పాఠశాల ఉపాధ్యాయులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను సభాపతి పోచారం ఆదేశించారు.