తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యుదాఘాతంతో ఒకరు... ఉరివేసుకొని మరొకరు - ఉరివేసుకొని మరొకరు మృతి

కామారెడ్డి జిల్ల వెళ్లుట్లపేట గ్రామంలో ఓ రైతు విద్యుదాఘాతంతో మృతి చెందాడు.

విద్యుదాఘాతంతో ఒకరు... ఉరివేసుకొని మరొకరు

By

Published : Oct 20, 2019, 3:09 PM IST

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని వెళ్లుట్ల పేట గ్రామంలో విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి చెందాడు. శనివారం సాయంత్రం వ్యవసాయ క్షేత్రంలోని బోర్ మోటార్ బంద్ చేయడానికి వెళ్లిన మల్లయ్య... విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు. మృతదేహాన్ని ఎల్లారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అదే మండలంలోని లక్ష్మాపూర్ గ్రామంలో రాములు అనే వ్యక్తి ఈ రోజు ఉదయం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

విద్యుదాఘాతంతో ఒకరు... ఉరివేసుకొని మరొకరు

ABOUT THE AUTHOR

...view details