కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన గడ్డం రామకృష్ణ ప్రమాదవశాత్తు పోచారం కాలువలో పడి మృతి చెందాడు. ఉదయం 8 గంటల సమయంలో భార్య పద్మకు చెప్పి లింగంపల్లి( కుర్దూ)గ్రామంలో గేదెను కొనటానికి సైకిల్‌పై వెళ్లాడు. ప్రమాదవశాత్తు సైకిల్‌తో పాటు కాలువలో పడి మృతి చెందాడు. మృతుడికి సొమ్మ రోగం ఉన్నట్లు కుటుంబీకులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఎల్లారెడ్డికి చెందిన కొత్తపేట సాయిలు గ్రామంలోని పెద్ద చెరువులో పడి మృతి చెందాడు. ఆదివారం సాయంత్రం కుటుంబ సభ్యులతో గొడవపడి సాయిలు బయటకు వెళ్లిపోయాడు. అప్పటి నుంచి కుటుంబ సభ్యులు ఎంత వెతికినా సమాచారం దొరకలేదు. మంగళవారం మధ్యాహ్నం చెరువులో శవమై కనిపించాడు. భార్య స్వరూప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఒకరు చెరువులో.. మరొకరు కాలువలో... - కామారెడ్జిలో సొమ్మ వచ్చి కాలువలో పడిపోయిన వ్యక్తి
బర్రెను కొనేందుకని ఒకరు... భార్యతో గొడవపడి మరొకరు వెళ్లి నీటిలో శవాలుగా తేలారు.

ఒకరు చెరువులో.. మరొకరు కాలువలో...