జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్లో జడ్పీ ఛైర్పర్సన్ సరిత, ఎమ్మెల్యే అబ్రహం జోగులాంబ ఎత్తిపోతల ద్వారా నీటిని విడుదల చేశారు. జిల్లాలో ప్రతి ఎకరాకు నీరందించేందుకు కృషిచేస్తున్నామని సరిత అన్నారు. జోగులాంబ ఎత్తిపోతల పథకంతో అలంపూర్ ప్రాంతం సస్యశ్యామలం కానుందని తెలిపారు. గతంలో సాగునీటి సమస్యల వల్ల వలస వెళ్లినవారంతా తిరిగి స్వగ్రామాలను తిరిగివస్తున్నారని ఎమ్మెల్యే అబ్రహం తెలిపారు.
అలంపూర్ సస్యశ్యామలం కానుంది: జడ్పీ ఛైర్పర్సన్ - జడ్పీ ఛైర్పర్సన్ సరితా
జోగులాంబ ఎత్తిపోతల పథకం ద్వారా అలంపూర్ సస్యశ్యామలం కానుందని జడ్పీ ఛైర్పర్సన్ సరిత అన్నారు. స్థానిక ఎమ్మెల్యే అబ్రహంతో కలిసి జోగులాంబ ఎత్తిపోతల ద్వారా నీటిని విడుదల చేశారు.

అలంపూర్ సస్యశ్యామలం కానుంది: జడ్పీ ఛైర్పర్సన్