తెలంగాణ

telangana

ETV Bharat / state

'గ్రామ స్వరాజ్యం సీఎం కేసీఆర్‌ పాలనలో సాధ్యమైంది' - జోగులాంబ గద్వాల జిల్లా తాజా వార్తలు

గ్రామ స్వరాజ్యం రావాలంటే పల్లెలు బాగుండాలని ఆనాడు మహాత్మాగాంధీ చెప్పిన మాటలు నేడు కేసీఆర్ పాలనలో సాధ్యమయ్యాయని.. జోగులాంబ గద్వాల జిల్లా పరిషత్‌ ఛైర్‌ పర్సన్‌ సరిత అన్నారు. ఆజాదీ కా అమృత్​ మహోత్సవ్​ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన కవి సమ్మేళనానికి... జిల్లా కలెక్టర్‌ శ్రుతి ఓజాతో కలిసి ఆమె హాజరయ్యారు.

ZP Chairperson Sarita participated in Azadi Ka Amrit Mahotsav program in Jogulamba Gadwal district, Azadi Ka Amrit Mahotsav program in Jogulamba Gadwal
ఆజాదీ కా అమృత్​ మహోత్సవ్​ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన కవి సమ్మేళనంలో పాల్గొన్న జోగులాంబ గద్వాల జిల్లా పరిషత్‌ ఛైర్‌ పర్సన్‌ సరిత, ఆజాదీ కా అమృత్​ మహోత్సవ్​

By

Published : Apr 3, 2021, 5:04 PM IST

ఆజాదీ కా అమృత్​ మహోత్సవ్​ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ శ్రుతి ఓజా, జడ్పీ ఛైర్‌ పర్సన్‌ సరిత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

గ్రామ స్వరాజ్యం రావాలంటే పల్లెలు బాగుండాలని ఆనాడు మహాత్మాగాంధీ చెప్పిన మాటలు, నేడు కేసీఆర్ పాలనలో సాధ్యమయ్యాయని జిల్లా పరిషత్‌ ఛైర్‌ పర్సన్‌ సరిత అన్నారు. ఈ సందర్భంగా చిన్నప్పుడు పాడుకున్నదేశ భక్తి గీతాలను ఆమె గుర్తు చేసుకున్నారు.

ఇదీ చదవండి:దేశంలోనే తెలంగాణ మొదటిస్థానం: కేటీఆర్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details