జోగులాంబ గద్వాల జిల్లాలో భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి అలంపూర్ నియోజవర్గం ఉండవల్లిలోని ఎంఆర్సీ భవనం వద్ద పసుపు వర్ణం కప్పలు సందడి చేశాయి. వర్షాలు పడ్డప్పుడు ఈ రకం కప్పలు కనిపిస్తాయని పలువురు తెలిపారు.
వర్షంతో వచ్చే పసుపురంగు కప్పలు శుభ సూచికమట...
ఇప్పటి వరకు మనం గోధుమ వర్ణం, ముదురు ఆకుపచ్చ వర్ణంలో ఉన్న కప్పలనే చూశాం. తాజాగా జోగులాంబ గద్వాల జిల్లాలో ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. అలంపూర్ నియోజకవర్గం ఉండవల్లి మండలంలో రాత్రి కురిసిన వర్షానికి పసుపు పచ్చ రంగులో కప్పలు దర్శనమిచ్చాయి.
ఈ రంగులో ఉన్న కప్పలను ఎప్పుడైనా చూశారా?
భారీ ఎత్తున కప్పలు ఆ ప్రాంతంలో అటూ ఇటూ దుముకుతుంటే వాటిని చూడడానికి చుట్టుపక్కల నుంచి జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇవి శుభసూచకమని ప్రజలు చర్చించుకున్నారు.