జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం బైరాపురం గ్రామానికి చెందిన షేక్ రసూల్ బాషా, షేక్ షబానా భార్యాభర్తలు. వివాహమైన ఒక సంవత్సరం తర్వాత ఆమె గర్భం దాల్చినప్పటికీ... కొన్ని కారణాల వల్ల పుట్టిన బిడ్డ చనిపోయాడు. తర్వాత రెండో సారి కూడా అలాగే జరిగింది.
కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య - జోగులాంబ గద్వాల జిల్లా తాాజా వార్తలు
పుట్టిన పిల్లలు చనిపోతున్నారనే మనోవేదన ఓవైపు. ఇంట్లో భర్త వేధింపులు మరోవైపు. ఇవన్నీ ఆమెను మానసికంగా కుంగదీశాయి. దీంతో ఆ ఇల్లాలు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలంలో చోటుచేసుకుంది.
కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య
అప్పటినుంచి భార్యాభర్తల మధ్య పిల్లల విషయంలో తరచూ గొడవలు జరుగుతుండేవి. దీంతో మనస్తాపం చెందిన షేక్ షబానా చీరతో ఉరి వేసుకుని ఇంట్లో ఆత్మహత్య చేసుకుందని కుటుంబసభ్యులు తెలిపారు. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఉండవల్లి ఎస్సై జగన్మోహన్ వెల్లడించారు.